ABVIMS లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జాబ్ నోటిఫికేషన్

ఎంబిబిఎస్ లో డిగ్రీ పూర్తి చేశారా. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదలైంది. ఎవరైతే కింద పేర్కొన్న మినిమం క్వాలిఫికేషన్ కలిగి ఉంటారు వారు ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులవుతారు. దయచేసి కింద పేర్కొన్న వివరాలను పూర్తిగా చదివి మరియు కింద ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయవలసి ఉంటుంది.

ఈ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది కావున ఏ రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులైన అప్లై చేయడానికి అర్హులు. కాకపోతే మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది. అది నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది దయచేసి నోటిఫికేషన్ పూర్తిగా చదవవలసి ఉంటుంది.

చివరి తేదీ

అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రెసిడెంట్ నాన్ అకాడమిక్ లో రెగ్యులర్ విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ జూన్ 6 2024.

ఈ నోటిఫికేషన్ ద్వారా అటల్ బిహారీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మెడికల్ సూపర్నెంట్, జూనియర్ రెసిడెంట్ నాన్ అకాడమిక్ విభాగంలో 255 పోస్టులు ఉన్నాయి

ఖాళీలు

ఇందులో జనరల్ విభాగం లో 108, EWS లో 24, OBC లో 60, SC లో 43, ST లో 20 ఉన్నాయి. మొత్తం పూర్తిగా 255 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎంబిబిఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. వీటిని కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్నారు ఇవి పర్మినెంట్ పోస్టులు కావు. ఈ కాంట్రాక్ట్ అనేది సంవత్సరం పాటు ఉంటుంది తర్వాత కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ చేయవచ్చు లేదా కాంట్రాక్టు క్లోజ్ చేయవచ్చు. అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులు

ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రారంభ వేతనం 56100( పే మాట్రిక్స్ లెవెల్ 7) గా ఉంటుంది. కింద ఇచ్చిన నోటిఫికేషన్లు అన్ని ఇవ్వడం జరిగింది దయచేసి నోటిఫికేషన్ పూర్తిగా చదవగలరని మనవి.

అర్హతలు:

పైన పేర్కొన్న పోస్టులకు అప్లై చేయడానికి MBBS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు చివరి సంవత్సరంలో ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. అప్లికేషన్ చివరి తేదీ నాటికి పైన పేర్కొన్న అర్హతలు కలిగి ఉండాలి. ఎవరైతే 31.05.2022 ముందు చేసి ఉంటారో వారు అప్లై చేయడానికి అర్హులు కారు. ఎవరైనా JR ship గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుండి కంప్లీట్ చేసి ఉంటారు వాళ్లు కూడా ఈ ఉద్యోగానికి అర్హులు కాదు. SC, ST అభ్యర్థులు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

ఓబీసీ అభ్యర్థులు కూడా లేటెస్ట్ ఓబీసీ సర్టిఫికెట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు కూడా డిసేబులిటీ సర్టిఫికెట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఇన్కమ్ సర్టిఫికెట్ మరియు అసెట్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు 800 రూపాయలు మరియు 800 రూపాయలు కింద పేర్కొన్న బ్యాంక్ అకౌంట్లో జమ చేయవలసి ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు చెల్లించినట్లయితే మరల రిఫండ్ చేయడానికి వీలు కుదరదు కావున అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయగలరని మనవి. . ఈ నోటిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి మొదట అభ్యర్థులు కింద ఇచ్చిన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తరువాత ఈ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫామ్ నింపవలసి ఉంటుంది. ఈ ఉద్యోగానికి పరీక్ష 50 మార్కులకు జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.

పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పరీక్ష పూర్తయ్యాక వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. దయచేసి అభ్యర్థులు అక్కడి నుంచి మిగతా వివరాల చూడవలసిందిగా కోరుతున్నాము.

మీరు గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మా ఈ వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించవలసిందిగా కోరుచున్నాము మరియు మీ స్నేహితులు గాని బంధువులు కానీ ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేరైనట్లయితే వారికి ఈ వెబ్సైట్ ని షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము మేము ప్రతిరోజు జవాబు అప్డేట్స్ మరియు జాబ్ నోటిఫికేషన్స్ ఈ వెబ్సైట్లో పొందుపరుస్తున్నాము. మీరు ఎలాంటి స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఉద్యోగాలకు ప్రిపేరైతే మా వెబ్సైట్లో సందర్శించవలసిందిగా కోరుచున్నాము. ఇటువంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం మా వెబ్సైట్ను ఫాలో అవ్వండి.

మా వెబ్సైట్ కి ఆండ్రాయిడ్ యాప్ కలదు, ఆసక్తిగల అభ్యర్థులు ప్లే స్టోర్ కి వెళ్లి విజేత జాబ్స్ అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేయవలసిందిగా కోరుచున్నాము మరియు నలుగురికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. మేము చాలా టైం తీసుకొని ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్ మీకు అందిస్తున్నాను దయచేసి మా కష్టాన్ని గుర్తించగలరని మనవి.

Notification
Wesite

Leave a Comment