యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ద్వారా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ నోటిఫికేషన్ పేజీలో చూడండి.
ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా లో కెమిస్ట్ డిప్యూటీ సూపర్ండెండింగ్ ఆర్కియాలజికల్ కెమిస్ట్ విభాగంలో నాలుగు పోస్టులు ఉన్నాయి, ఇందులో జనరల్ కేటగిరిలో రెండు, ఓబీసీ లో ఒకటి, ఎస్సీ లో ఒకటి ఉన్నాయి. దీనికి అప్లై చేయాలనుకుంటే బ్యాచిలర్స్ లో డిగ్రీ చేసి ఉండాలి మరియు కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి లేదా కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
డిప్యూటీ సూపరిండెంటింగ్ ఆర్కియాలజిస్ట్ ఇన్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో 67 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీడికి అప్లై చేసుకోవడానికి మాస్టర్స్ డిగ్రీలో ఆర్కియాలజీ చదివి ఉండాలి మరియు కనీసం మూడు సంవత్సరాల ఫీల్డ్ అనుభవం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉండాలి. ఈ ఉద్యోగానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఢిల్లీలో కలదు.
సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇందులో మొత్తం నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి వీటికి అప్లై చేయడానికి ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి దీనికి అప్లై చేసుకోవడానికి ఎంబిబిఎస్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పూర్తి చేసి ఉండాలి. దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కూడా ఢిల్లీలో ఉంది.
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 23 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి అప్లై చేయడానికి కూడా ఎంబిబిఎస్ ఫస్ట్ క్లాస్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఇంకా స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో 100కు పైగా ఖాళీలను గుర్తించారు దీనికి సంబంధించిన ఖాళీలను కింద పేర్కొన్న నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆయా భాగాల్లో రిజర్వేషన్ల వారీగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన లింకును కింద ఇవ్వడం జరిగింది దాన్ని ఓపెన్ చేసి పూర్తిగా చదివి అర్హులు అయితే అప్లై చేయగలరు. మొత్తం 15 విభాగాలలో స్పెషలిస్ట్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. పైన పేర్కొన్న ఉద్యోగాలకు ఎంపికైనట్లయితే ప్రారంభ వేతనం 60000 నుండి మొదలవుతుంది.
ఇంటలిజెంట్ బ్యూరో విభాగంలో కూడా పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ లో ఖాళీలు గుర్తించడం జరిగింది. . ఇంటలిజెంట్ బ్యూరో విభాగంలో డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ టెక్నికల్ విభాగంలో ఖాళీలను గుర్తించారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకుంటే ఇంజనీరింగ్ డిగ్రీ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అన్ని కమ్యూనికేషన్ విభాగంలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే ప్రారంభ వేతనం 56,100గా ఉంటుంది.
హార్టికల్చర్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఖాళీలను గుర్తించారు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ లో మొత్తం నాలుగు ఖాళీలు ఉన్నాయి దీనికి సంబంధించిన ఖాళీలను కూడా నోటిఫికేషన్లు విడుదల చేశారు. వీటికి అప్లై చేయడానికి అగ్రికల్చర్ లో MSc పూర్తి చేసి ఉండాలి మరియు రెండు సంవత్సరాల పనే అనుభవం కలిగి ఉండాలి.
ఇంకా ఇటువంటి జాబ్ వివరాలను కింద పేర్కొన్న నోటిఫికేషన్ PDF లో ఇవ్వడం జరిగింది. . ఎవరైనా ఉద్యోగాలుగా అప్లై చేయాలనుకుంటే కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయగలరు. టెక్నికల్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబిబిఎస్ డిగ్రీ ఉద్యోగాలకు వేరువేరుగా ఖాళీలను గుర్తించడం జరిగింది. . ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు పూర్తిగా నోటిఫికేషన్లు చదివి అప్లై చేయగలరని మనవి. అప్లికేషన్ లింకు కూడా కింద ఇవ్వడం జరిగింది.
మీకు ఇటువంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్లో కావాలనుకుంటే ప్రతిరోజు మా ఈ వెబ్సైట్ ని సందర్శించగలరు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లు అయితే వారికి మా ఈ వెబ్సైట్ లింకును షేర్ చేయగలరు. ఈ వెబ్సైట్ కి సంబంధించిన మొబైల్ యాప్ లింకును కూడా మేము ప్లే స్టోర్ లో అప్డేట్ చేశాము మీరు ఈ వెబ్సైట్ హోం పేజీలో ఇచ్చిన ఆండ్రాయిడ్ యాప్ లింకును క్లిక్ చేసి యాప్ ను ఇన్స్టాల్ చేసి జాబ్ అప్డేట్స్ అక్కడి నుంచి పొందగలరని మనవి.
మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయగలరు. మా టీం మీకు తొందరగా రిప్లై ఇవ్వడానికి సహాయం చేస్తుంది.