మీరు టెన్త్, ఇంటర్ మరియు డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీ కోసమే…..
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు లాబోరేటరీ అటెండెంట్ విభాగాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఖాళీలు భర్తీ చేయనున్నారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఉద్యోగాలు
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి పరీక్ష ఫీజు 1200 రూపాయలు, మరియు ఎస్సీ ఎస్టీ ఉమెన్ అభ్యర్థులకు 1000 రూపాయలు, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఈ ఉద్యోగానికి అప్లికేషన్లు ఆన్లైన్ లో మాత్రమే నింపవలసి ఉంటుంది. ICMR NIN కు సంబంధించిన వెబ్సైట్లో ఆన్ లైన్ అప్లికేషన్ లింకు కలదు అక్కడ నుండి అప్లై చేయగలరు.
అర్హత మరియు వివరాలు
టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో కెమిస్ట్రీ మరియు బయో కెమిస్ట్రీ లో 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో OBC లో ఒక పోస్టు, EWS లో ఒక పోస్టు SC లో ఒక పోస్టు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ లో భాగంలో రెండు పోస్టులు ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ లో రెండు పోస్టులు OBC వారికి ఉన్నాయి. ఫుడ్ సైన్స్ లేదా న్యూట్రిషన్ సైన్స్ లో మూడు పోస్టులు ఉన్నాయి ఈ మూడు పోస్టుల్లో EWS లో రెండు, SC లో ఒక పోస్టు ఉన్నాయి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ విభాగంలో అప్లై చేయడానికి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
టెక్నీషియన్ విభాగంలో పోస్ట్ కోడ్ 1 ప్రకారం రెండు జనరల్ పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ పోస్ట్ కోడ్ 2 ప్రకారం ఆరు పోస్టులు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 3 ప్రకారం రెండు, పోస్ట్ కోడ్ 4 ప్రకారం రెండు, పోస్ట్ కోడ్ 5 ప్రకారం 2 పోస్టులు ఉన్నాయి. ఈ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్లో 50% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
ఖాళీలు
లాబోరేటరీ అటెండెంట్ పోస్ట్ కోడ్ 1 విభాగంలో ఏడు పోస్టులు మరియు లాబోరేటరీ అటెండెంట్ పోస్ట్ కోడ్ విభాగంలో 15 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 10వ తరగతిలో 50% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే పోస్టింగ్ అనేది హైదరాబాద్ లోనే ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది హైదరాబాద్ లోనే ఉంది. తెలంగాణలో ఉండే అభ్యర్థులు దీన్ని సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ 23 మే 2024 మరియు చివరి తేదీ16 జూన్ 2024. పరీక్ష తేదీ జూలై 2024 లో ఉంటుంది. హాల్ టికెట్లు జూన్ లేదా జూలై 2024 లో విడుదల చేస్తారు.
పరీక్ష విధానం
పరీక్ష 90 మార్కులకు జరుగుతుంది, ప్రతి ప్రశ్నకు 1 మార్కు మరియు నెగిటివ్ మార్కింగ్ కలదు. ఒక తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ కలదు. టెక్నికల్ అసిస్టెంట్లకు ప్రారంభ వేతనం 35,400 గా ఉంది, టెక్నీషియన్లకు ప్రారంభ వేతనం 20,000 ఉంది లాబోరేటరీ అటెండెంట్ కు ప్రారంభ వేతనం 18000గా ఉంది.
ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్
ఎవరికైనా సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నట్లయితే వాటికి అనుగుణంగా మార్కులు కలుపుతారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ని ఆన్లైన్ ఫామ్ లో ఫిల్ చేయగలరు. రిజర్వేషన్ గల అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
పైన పేర్కొన్న స్క్రీన్ షాట్ లో ఉన్న విధంగా ఎక్స్పీరియన్స్ గల అభ్యర్థులకు మార్కులు కలుపుతారు.
సిలబస్
టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ మరియు లాబోరేటరీ అటెండెంట్ లకు 90 మార్కులకు పరీక్ష జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ లో 15 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో 15 మార్కులు ఇంగ్లీషులో 15 మార్కులు, జనరల్ అవేర్నెస్ లో 15 మార్కులు మరియు సంబంధిత సబ్జెక్టు విభాగంలో ఉంటాయి 30 మార్కులు ఉంటాయి. పాస్ అవ్వడానికి కనీస అర్హత మార్కులు ఓబిసి అభ్యర్థులకు 35%, జనరల్ అభ్యర్థులకు 40 శాతం SC/ST అభ్యర్థులకు 30%.
సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ ను ICMR వెబ్సైట్లో పొందుపరిచింది. మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఏమైనా డౌట్లు ఉంటే కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ ని క్లిక్ చేసి పూర్తిగా చదివి అప్లై చేయగలరు, అప్లికేషన్ లింక్ కూడా కింద ఇవ్వబడింది. కింద పేర్కొన్న లింకును క్లిక్ చేసి అప్లై చేయగలరు.
మీకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్లు మరిన్ని కావాలనుకుంటే మా ఈ జాబ్ పోర్టల్ ను డైలీ ఫాలో అవ్వండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులందరికీ జాబ్ నోటిఫికేషన్ లింకు ను షేర్ చేయండి.