ఆర్మీలో ఉద్యోగాలు
ఇంటర్ పూర్తి చేశారా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తున్నారా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీ కోసమే. ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్మీలో ఉన్న ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. . మొదటగా నాలుగు సంవత్సరాలు మీకు ఇంజనీరింగ్ సంబంధించిన టెక్నికల్ సబ్జెక్టును బోధించడం మరియు ప్రాక్టికల్స్ ఉంటాయి. నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీకు ఇంజనీరింగ్ లో డిగ్రీను ఇస్తారు,
ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసిన వారికి ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా వివాహం కానీ పురుషులు గాని మహిళలు కానీ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి అర్హులు. ఇంటర్లో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లో పూర్తి చేసిన వారు మరియు జేఈఈ ఎగ్జామ్ రాసిన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు. అతి చిన్న వయసులో ఈ ఉద్యోగానికి ఎంపికైనట్లయితే రిటైర్ అయ్యే సమయానికి మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కావాల్సిన అర్హతలు
భారతీయ, లేదా నేపాల్ లేదా భూటాన్ పౌరుడు అయి ఉండాలిమరియు వివాహం చేసుకొని ఉండరాదు. వయసు 16½ నుండి 19½ మధ్యలో ఉండాలి. అనగా అభ్యర్థులు జులై 2005 ముందు పుట్టి ఉండరాదు మరియు జూలై 2008 తర్వాత కూడా పుట్టి ఉండరాదు. కనీసం వయసు 16 సంవత్సరాలు గరిష్ట వయసు 19 సంవత్సరాలు ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే నాలుగు సంవత్సరాలు ఇండియన్ ఆర్మీ నుంచి ట్రైనింగ్ కి పిలుపు వస్తుంది, ట్రైనింగ్ పూర్తి చేసుకున్నట్లయితే ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
ఖాళీలు మరియు ట్రైనింగ్
మొత్తం 90 ఖాళీలు ఉన్నాయి, పూర్తిగా నాలుగు సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ తో పాటు వీరు ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టా ఇస్తారు. నాలుగు సంవత్సరాలు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆర్మీలో లెఫ్టినెంట్ ఆఫీసర్ స్థాయిలో హోదాను కల్పిస్తారు.2 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ లో భాగంగా కెప్టెన్ ర్యాంకుకు ప్రమోట్ చేస్తారు. తర్వాత ఆరు సంవత్సరాలకు మరల 13 సంవత్సరాలకు ప్రమోషన్ ఉంటుంది.
ట్రైనింగ్ అనేది రెండు ఫేజ్ లలో ఇస్తారు. మొదటి ఫేజ్ లో భాగంగా ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలటరీ ట్రైనింగ్ మరియు ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్ అనేది సికింద్రాబాద్ మరియు పూణేలో ఉంటుంది. రెండవ ఫేజ్ లో భాగంగా ఇండియన్ మిలిటరీ అకాడమీ అయిన డెహ్రాడూన్ లో ట్రైనింగ్ మరియు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వారికి ఫ్రీ జాయినింగ్ ఆర్డర్లను ఇస్తారు.
జీతభత్యాలు
పూర్తిస్థాయిలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రారంభ వేతనం 56,100 ఉంటుంది, చేతికి సుమారుగా 80,000 వరకు అందుతాయి. మరియు మిలిటరీ సర్వీస్ పే ప్రకారం ప్రతి నెల 15,500 ఇస్తారు. మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోగానే లెఫ్టినెంట్ గా ప్రమోట్ చేస్తారు. యూనిఫామ్ అలవెన్స్ కింద సంవత్సరానికి 20000 ఇస్తారు.
అప్లై చేసుకోవాలి అనుకుంటే కింద పేర్కొన్న వెబ్సైట్ కి వెళ్లి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరియు ఈ ఉద్యోగానికి ఎంపిక అవ్వడానికి ఫిట్నెస్ పరీక్ష ఖచ్చితంగా ఉంటుంది అభ్యర్థుల ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వారిని అనర్హులుగా భావిస్తారు మరియు మెడికల్ టెస్ట్ లు అన్నిట్లో పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే తీసుకుంటారు.
సెలక్షన్ ప్రాసెస్
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే కనీస అర్హత ఇంటర్మీడియట్ మాత్రమే. ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కు సంబంధించిన సబ్జెక్టులలో పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగానికి అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే ఫిల్ చేయవలసి ఉంటుంది, షాట్లిస్ట్ అయిన అభ్యర్థులను SSB ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ జాబితాను ప్రిపేర్ చేసి వెబ్సైట్లో పొందుపరుస్తారు. అభ్యర్థులకు ఆగస్టు లేదా సెప్టెంబర్ 2024 నుండి ట్రైనింగ్ మొదలుపెడతారు.
మీకు ఈ జాబ్ కి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మేము వీలైనంత తొందరగా మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తాము, లేదా మీరు కింద ఇచ్చిన నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి జాబ్ కు అప్లై చేయగలరు. మీకు ఈ నోటిఫికేషన్ గానీ మీ స్నేహితులకు కానీ ఇతర బంధుమిత్రులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము
మీరు ఇటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ కావాలనుకుంటే ప్రతిరోజూ మా ఈ వెబ్సైట్ ని సందర్శించవలసిందిగా కోరుచున్నాము. మేము ప్రతిరోజు మా వెబ్సైట్ లో జాబ్ అప్డేట్స్ ని ఇస్తున్నాము. ఎవరైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్రతిరోజు మా ఈ వెబ్సైట్ ని సందర్శించవలసిందిగా కోరుతున్నాము మరియు మీకు తెలిసిన బంధుమిత్రులందరికీ వెబ్సైట్ ని షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ వెబ్సైట్ కి సంబంధించిన మొబైల్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ప్లే స్టోర్ లింక్ అనేది వెబ్సైట్ హోమ్ పేజీలో పైన నోట్ ఇవ్వడం జరిగింది.