నేవీలో అవకాశం
మీరు ఇంటర్ MPC లో కంప్లీట్ చేశారా? ఇండియన్ నేవీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఈ సువర్ణ అవకాశం మీకోసమే… పెళ్ళి కాని యువతీ యువకులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్ని వీర్ బ్యాచ్ లో నేవీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కింద ఇచ్చిన కనీస అర్హత వివరాలను చూడండి.
కనీస అర్హత
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలనుకుంటే కనీసం ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు పూర్తి చేసి ఉండాలి, మరియు ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
లేదా డిప్లమా లో మూడు సంవత్సరాలు కోర్సు పూర్తి చేసిన ఉండాలి. డిప్లమా బ్రాంచ్ లలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో స్టేట్ లేదా సెంట్రల్ లెవెల్ లో పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో 50% కనీసతో కంప్లీట్ చేసి ఉండాలి
లేదా ఏదైనా రెండు సంవత్సరాల ఒకేషనల్ కోర్సు కంప్లీట్ చేసి ఉండాలి ఇందులో కూడా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అనేది కనీస అధ్యక్షులుగా ఉండాలి మరియు 50% మార్కులు కచ్చితంగా ఉండాలి. ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం లేదా మార్కులు ఇంకా రిలీజ్ అవని వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు.
నియామక వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా నావి లో అగ్ని వీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు వీరికి పూర్తిగా నాలుగు సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చి జూనియర్ ర్యాంకు హోదాలో నేవీలో ఆఫీసర్లుగా నియమించనున్నారు. ఈ నోటిఫికేషన్ కు ఎంపిక అయితే ఈ నాలుగు సంవత్సరాలు ట్రైనింగ్, అన్ని ఖర్చులు ఇండియన్ నేవీ భరిస్తుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి చివరి తేదీ 27 MAY 2024.
జీతభత్యాలు మరియు పెన్షన్
ట్రైనింగ్ లో ఉన్నప్పుడు 30,000 ప్రతినెలా ఇస్తుంది మరియు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ లో ఉంటాయి. ట్రావెలర్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్ అవన్నీ జీతం రూపంలో ప్రతినెలా అందజేస్తాయి.
మొదటి సంవత్సరం ప్రతినెల 30,000, రెండవ సంవత్సరం ప్రతినెల 33,000, మూడవ సంవత్సరం ప్రతినెల 36,500, నాలుగో సంవత్సరంలో ప్రతినెల 40000 ఇలా జీతం ఇస్తారు. వీరికి 48 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అయ్యే విధంగా ఇన్సూరెన్స్ ఇస్తారు. రిటైర్ అయ్యాక నావి రూల్స్ అనుగుణం ప్రకారం పెన్షన్లు ప్రతినెలా పే చేస్తారు.
ఎంపిక వివరాలు
ఈ ఉద్యోగానికి ఎంపిక అవ్వడానికి ముందుగా నావి ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై చేయాల్సి ఉంటుంది దీని తర్వాత మెడికల్ పూర్తిచేసి నావిలోకి తీసుకుంటారు. నావి ఎంట్రన్స్ టెస్ట్ లో ఇంగ్లీషు, సైన్సు, మ్యాథమెటిక్స్ మరియు జనరల్ అవేర్నెస్ కు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. మొత్తం పూర్తిగా మంద ప్రశ్నలుంటాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. సిలబస్ పూర్తిగా ఇంటర్మీడియట్ లెవెల్ లో ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్నారో వారు కింద ఇచ్చిన నోటిఫికేషన్ ని పూర్తిగా చదివి అప్లై చేయగలరని మనవి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
అప్లికేషన్ ఫీజు
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి 550 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది మరియు దాని మీద 18% GST ఉంటుంది.
మెడికల్ టెస్ట్
అప్లై చేసిన అభ్యర్థి మెడికల్ టెస్ట్ పూర్తి చేయవలసి ఉంటుంది మెడికల్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులను మాత్రమే తీసుకుంటారు. మెడికల్ టెస్ట్ కంప్లీట్ చేసినవారికి మెరిట్ లిస్ట్ లో చోటు దక్కుతుంది. మెడికల్ టెస్ట్ లో క్వాలిఫై అవ్వడానికి కావలసిన కనీస ఎత్తు 157 సెంటీమీటర్లు, అభ్యర్థులకి చేతి పై కాని శరీరం పై గాని ఎటువంటి టాటూలు ఉండకూడదు ఉంటే మెడికల్ టెస్ట్ కి అర్హులుగా ప్రకటిస్తారు. మంచి కంటి చూపు కలిగి ఉండాలి ఎటువంటి కళ్ళజోడు లాంటివి ధరించి ఉండకూడదు ధరిస్తే దీనికి అనర్హులుగా భావించి ఎంపిక చేయరు.
నావి లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు ఇచ్చి మోసపోకూడదని మనవి ఎందుకంటే ఈ ఉద్యోగాలు చాలా పారదర్శకంగా జరుగుతాయి, మరియు బయట చాలా కోచింగ్ సెంటర్లు నేవీలో కానీ ఎయిర్ఫోర్స్ లో కానీ ఆఫీసర్లు భర్తీకి కోచింగ్ లు ఇస్తాయి, అందులో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకోగలరని మనవి.
ట్రైనింగ్ నవంబర్ 2024 INS చిలక ఒడిస్సా లో మొదలవుతుంది. అప్లికేషన్ లింకును ఓపెన్ చేసి అప్లై చేయవలసిందిగా మరియు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయవలసిందిగా కోరుచున్నాము.
మీరు ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ లను కావాలనుకుంటే ప్రతిరోజు మా వెబ్సైట్ను సందర్శించవలసిందిగా కోరుతున్నాము, మీకు తెలిసిన బంధుమిత్రులందరికీ మా ఈ వెబ్సైట్ ను షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ వెబ్సైట్ కి సంబంధించిన మొబైల్ యాప్ పైన పేర్కొనడం జరిగింది దయచేసి యాప్ ఇన్స్టాల్ చేయవలసిందిగా కోరుచున్నాము మరియు మీకు తెలిసిన స్నేహితులు గాని ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే వారికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము.