DRDO లో ఉద్యోగాలు….

DRDO లో ఉద్యోగాలు

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కి చెందిన DMRL డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబరేటరీ లో అప్రెంటిస్ ట్రైనీలో భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబరేటరీ అనేది హైదరాబాదులో ఉంది 1963 లో దీన్ని స్థాపించారు డిఫెన్స్ కు సంబంధించిన మెటీరియల్స్ ని, డిఫెన్స్ అప్లికేషన్ లో వాడే టెక్నాలజీని దానికి సంబంధిత ప్రాజెక్టులు DMRL లో జరుగుతాయి.

డిఎంఆర్ఎల్ లో ఐటిఐ అప్రెంటిస్ లో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, టర్నర్, మెకానిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కార్పెంటర్ మరియు బుక్ బైండింగ్ విభాగాలలో పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీలు

ఫిట్టర్ విభాగంలో 20 పోస్టులు, టర్నర్ విభాగంలో 8 పోస్టులు, మెకానిస్ట్ విభాగంలో 16 పోస్టులు, వెల్డర్ విభాగంలో నాలుగు పోస్టులు, ఎలక్ట్రిషన్ విభాగంలో 12 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ విభాగంలో నాలుగు పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో 60 పోస్టులు, కార్పెంటర్లో రెండు పోస్టులు, బుక్ బైండింగ్ విభాగం లో ఒక పోస్టు ఉన్నాయి. SC, ST, OBC వారికి రిజర్వేషన్లు కలవు. సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.

పైన పేర్కొన్న అప్రెంటిస్ పోస్టులను అప్లై చేసుకోవడానికి ఇండియాలో పుట్టి పెరిగిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు అర్హులు. ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసే ముందు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ని పూర్తిగా చదివి అప్లై చేయగలరు. కింద పేర్కొన్న జాబ్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయగలరని మనవి

అప్లై చేయడానికి కనీస అర్హత

ఎవరైతే ఐటిఐ పైన పేర్కొన్న విభాగంలో కనీస అర్హత ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు. ఐటిఐ రెగ్యులర్ విభాగంలో చేసిన వారు పైన పేర్కొన్న అప్రెంటిస్ పోస్టులకు అర్హులవుతారు. ఎవరైతే ఇతర అప్రెంటిస్టులలో ఇప్పుడు పని చేస్తూ ఉన్నారో వారు ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు కాదు. ఎవరైతే ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యి 15 రోజుల కంటే ఎక్కువగా రిపోర్టు చేయని వారు ఉంటారో వారిని ఎటువంటి తీసివేయడం జరుగుతుంది.

ఈ అప్రెంటిస్ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఉపయోగించి అందులో పేర్కొన్న విభాగాలు అన్నిటికీ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది మరియు అప్రెంటిస్ కి సంబంధించిన వెబ్ సైట్ లో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింకులన్నిటిని కింద ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ సంబంధించిన వివరాలన్నిటిని సమయానుకూలంగా డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబరేటరీ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. తరచూ వెబ్సైట్ నుంచి చూడండి

ఎవరైతే కనీస అర్హత కంటే ఎక్కువగా కలదో వారు ఈ అప్రెంటిస్ పోస్ట్ కు అప్లై చేయడానికి అర్హులు కాదు, మరియు ఈ అప్రెంటిస్ కాంటాక్ట్ విభాగంలో భర్తీ చేయనున్నారు ఈ అప్రెంటిస్ కాంట్రాక్ట్ ఒక సంవత్సరం మాత్రమే. కింద ఇచ్చిన గూగుల్ ఫామ్ ని ఎవరైతే నింపుతారు వారికి పర్సనల్ ఈమెయిల్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ తెలియజేయనున్నారు. ఈ అప్రెంటిస్ పోస్ట్ కి అప్లై చేసే ముందు కింద ఉన్న డాక్యుమెంట్లు కంపల్సరిగా ఉండవలసి ఉంటుంది.

కావలసిన డాక్యుమెంట్లు

SSC సర్టిఫికేట్, ఐటిఐ సర్టిఫికెట్, Caste/PWD సర్టిఫికేట్, కాపీ ఆఫ్ బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ కార్డు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మరియు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది పర్మినెంట్ జాబ్ మాత్రం కాదు కాంట్రాక్టులో వారు అప్రెంటిస్ లను భర్తీ చేయనున్నారు. ఇది ఒక సంవత్సరం మాత్రమే కాంటాక్ట్ ఉంటుంది. ఫిట్నెస్ కు సంబంధించిన డాక్యుమెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి కంపల్సరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

అప్లై చేయు విధానం:

దీనికి అప్లై చేయడానికి చివరి తేదీ 31 మే 2024. ఈ పోస్ట్ కు అప్లై చేసిన వారు తరచుగా ఈమెయిల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ కు సంబంధించిన ఏదైనా విషయాన్ని DRDO వాళ్ళు మెయిల్స్ రూపంలో మీకు తెలియజేస్తారు. ఎటువంటి TA/DA గాని సెలక్షన్ సమయంలో ఇవ్వరు.
కింద ఇచ్చిన గూగుల్ ఫామ్ ను నింపి ఈ జాబ్ పోస్ట్ కు అప్లై చేసుకోగలరు మరియు కింద ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఒకసారి పూర్తిగా చదివి జాబ్ కి మీరు అర్హులా కాదా అనే విషయాన్ని తెలుసుకోగలరు. అలాగే అప్రెంటిస్ ఇండియా కు సంబంధించిన వెబ్సైటుకు సందర్శించి మీరు అందులో రిజిస్టర్ చేసుకొని ఉండవలసి ఉంటుంది.

Notification
Google form Link
Apprentice website

Note:

మీకు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ తెలుసుకోవాలనుకుంటే తరచుగా ఈ వెబ్సైట్ ని చెక్ చేస్తూ ఉండండి. లేటెస్ట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం తరచుగా ఈ జాబ్ పోర్టల్ ని సందర్శిస్తూ ఉండండి. ఇలాంటి ఖచ్చితమైన జాబ్ అప్డేట్స్ ని డైలీ మేము పోస్ట్ చేస్తూ ఉంటాము.

Leave a Comment