ECIL లో ఉద్యోగాలు…..

ఈసీఐఎల్ లో భారీ వేతనంతో ఉద్యోగాలు

మీరు బీటెక్ కంప్లీట్ చేశారా?? లేదా బిటెక్ చివరి సంవత్సరం చేస్తున్నారా? అయితే ఈసీఐఎల్ లో భారీ వేతనంతో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ మార్చి నెలలో విడుదల అయింది. ఈ ఉద్యోగానికి అప్లై చేయడం ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనే పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించి ట్రైనింగ్, జాబ్ పోస్టింగ్ అనేది హైదరాబాద్ లోనే ఉంటుంది. ఎవరైతే ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నారో లేదా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు ఉన్నారో వారు ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు.

ఈసీఐఎల్ గురించి

ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పని చేయడం జరుగుతుంది. ఇందులో న్యూక్లియర్ డిఫెన్స్, సెక్యూరిటీ, ఏరోస్పేస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికాం అండ్ ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులలో ఈసీఐఎల్ పనిచేస్తుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి 27 సంవత్సరాల వరకు వయసున్న అభ్యర్థులు అర్హులు. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి కనీసం ఇంజనీరింగ్ లో 60% మార్కులు సాధించవలసి ఉంటుంది.



ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు కంపెనీలో కనీసం నాలుగు సంవత్సరాలు పనిచేయడానికి బాండ్ కట్టవలసి ఉంటుంది. ఒకవేళ నాలుగు సంవత్సరాల లోపు ఎప్పుడైనా ఉద్యోగం విడిచిపెట్టినట్లయితే నాలుగు లక్షలు కట్టవలసి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయస్సు సడలింపు కలదు. ఎంపికైన అభ్యర్థులు ఈసీఐఎల్ కు సంబంధించిన ప్రాజెక్టులలో పని చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ లో ఉన్న ఖాళీలను మాత్రమే భర్తీ చేయనున్నారు.

అర్హతలు

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఫుల్ టైం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి అర్హులు కారు.

మీరు ఇంజనీరింగ్ లో చేసిన అర్హతను బట్టి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఐదు పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో ఏడు పోస్టులు, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఐదు పోస్టులు మరియు మెకానికల్ ఇంజనీరింగ్ లో 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో కలిపి 30 పోస్టులను భర్తీ చేయనున్నారు.

కేటగిరి వారీగా పోస్టులు

ఈ 30 ఉద్యోగాలు కేటగిరి వారీగా జనరల్ లో 16, EWS లో 2, OBC 8 పోస్టులు, SC లో 1 పోస్టు, ST లో 4 పోస్టులను కేటగిరీ వారీగా భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగానికి ఎంపిక చేయడానికి రెండు విభాగాలలో అప్లికేషన్లను ఫిల్టర్ చేయనున్నారు. మొదట ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారికి 1:4 ప్రాతిపదికన ఇంటర్వ్యూలకి ఆహ్వానిస్తారు. అంటే ఒక్క జాబ్ కి నలుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అర్హత గల అభ్యర్థిని ఫైనల్ ఎలక్షన్ లిస్టులో ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ

రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూకి 85:15 లో కట్ ఆఫ్ తీసుకోవడం జరుగుతుంది. రాత పరీక్ష లో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ కు ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి అప్లై చేసే ముందు కిందపడిన నోటిఫికేషన్ అభ్యర్థులు పూర్తిగా చదవాల్సి ఉంటుంది. వయసు, అర్హత మొదలగునవి నోటిఫికేషన్ లో పూర్తిగా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్లు ఆన్లైన్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది

ఇంటర్వ్యూ చేసే ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. SC, ST, OBTC అభ్యర్థులకు సంబంధిత కాస్ట్ సర్టిఫికెట్ వెరిఫై చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో సంబంధిత టెక్నికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూకి అర్హత సాధించిన అభ్యర్థులను ఈసీఐఎల్ తమ వెబ్సైట్లో పొందుపరుస్తుంది.

ఇంటర్వ్యూ కేవలం హైదరాబాదులో మాత్రమే ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయిన వారికి స్లీపర్ క్లాస్ రైల్వే టికెట్ ఖర్చు ఈసీఐఎల్ భరిస్తుంది.

అప్లై చేయు విధానము

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలనుకుంటే ముందుగా ఈసీఐఎల్ వెబ్సైట్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ₹1000 కట్టవలసి ఉంటుంది. పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, కోల్కతాలో ఉంటుంది.

Salary

అర్హత పరీక్షకు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ కలదు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం 40,000 నుండి 1,40,000 మధ్యలో ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో కూడా శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక పూర్తిస్థాయిలో TA, DA ఇవ్వడం జరుగుతుంది.

కింద ఉన్న నోటిఫికేషన్లు లింకును క్లిక్ చేసి నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయవలసిందిగా కోరుచున్నాము. అప్లికేషన్ లింకు కూడా కింద ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి చివరి తేదీ జూన్ 16 2024.

Notification
Apply Now

Leave a Comment